Peacock painting : చాలా మంది నెమలి పెయింటింగ్ ను బహుమతులుగా ఇస్తుంటారు. అయితే దాన్ని ఏం చేసుకుంటాంలే అని పక్కన పడేయకండి ఇంట్లోని ఓ గోడపై వేలాడదీయండి. నెమలి ఫొటో ఉంటే మీ అదృష్టం మారిపోతుంది. నెమలి పెయింటింగ్ వల్ల శాంతి, అందం, ప్రేమకు చిహ్నం. దాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు కల్గే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Peacock painting
నెమలి పెయింటింగ్ విజయం, శక్తికి చిహ్నం. ఇది ఇంట్లో ఉంటే వ్యక్తిగత జీవితంలో విజయం లభిస్తుంది. మీరు ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కొనసాగించవచ్చు. అలాగే కొంత మంది ఆఫీసుల్లో నెమలి చిత్రాన్ని ఉంచుతారు. దాని వల్ల విజయంతో పాటు అధికారం కూడా లభిస్తుంది. ప్రమోషన్లు తొందరగా పొందగలరు. సాధారణంగా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నెమలి ఫొటో కనిపిస్తుంది. ఇంటి తలుపు దిశను బట్టి నెమలి రంగు వేసిన ముఖాన్ని వేలాడదీయాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో రెండు ముఖాల నెమలి బొమ్మ ఉంచడం వల్ల విజయం, శాంతిని పొందుతారట.
అలాగే నెమలి తన అందంతో అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి గది ముందు నెమలి నృత్యం చేస్తున్న ఫొటోను ఉంచినప్పుడు అది మనోహరంగా, చక్కగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నెమలి ఈకలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి. ఇల్లు లేదా ఆఫీసు మెయిన్ డోర్ దక్షిణం వైపు ఉంటే మంచిది. దక్షిణం వైపు లేకపోతే తూర్పు మంచిది.
Read Also :Vasthu Tips : లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!