Devotional Tips: ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం మన ఇంట్లో దీపారాధన చేసుకుని భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రతిరోజు ఉదయం స్వామి వారికి ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.అయితే ఎక్కువమంది చక్కెరను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం చూస్తుంటాం. ఇలా స్వామివారికి చెక్కర నైవేద్యంగా సమర్పిస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం…
అయితే భగవంతుడికి ఈ విధంగా చక్కెర నైవేద్యం పెట్టడం వల్ల దోషం కలుగుతుందని, ఇది మహా పాపమని చాలామంది భావిస్తారు. నిజానికి చక్కెర దేవుడికి నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది. చక్కెర నైవేద్యంగా సమర్పించడం వల్ల ఏ విధమైనటువంటి దోషం కలగదు.ఇలా స్వామి వారికి నైవేద్యంగా సమర్పించిన చక్కెరను ఎన్నో క్రిమి కీటకాలు తినటం వల్ల పుణ్య ఫలం కలుగుతుంది.
మనం దేవుడికి సమర్పించిన ఆహార పదార్థాలు పూజ అనంతరం ప్రసాదంగా మారుతుంది.కాబట్టి చక్కెర దేవుడికి నివేదనగా సమర్పించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు. కనుక చక్కెరను దేవుడికి నైవేద్యంగా పెట్టడంలో సందేహ పడాల్సిన పనిలేదు.