Panchatantra Kathalu: ‘పంచతంత్ర కథలు’ సినిమాకు కొత్త దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు గంగనమోని శేఖర్. ఇక ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1 గా వ్యాపారవేత్త డి.మధు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సినిమా ఐదు వేర్వేరు కథల నేపథ్యంలో రూపొందుతుంది కాబట్టి దీనికి పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు.
ఇక ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా బృందం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘మోతెవారి’ లిరిక్ వీడియో సాంగ్ ను విడుదల చేశాడు.
ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ క్యాచీ ట్యూన్ అందించాడు. రామ్ మిరియాల పాటను ఆలపించాడు. ఇక ఈ పాట విడుదల చేసినందుకు తరుణ్ భాస్కర్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాలో ఈ పాట విడుదల చేయటం తనకు సంతోషమని.. ఇది తన ఫేవరేట్ అని అన్నాడు. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ వినడం జరిగింది అని.. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్ అని అన్నాడు. అంతేకాకుండా ఈ మ్యూజిక్ ను అందించిన టెక్నీషియన్స్ లను ప్రశంసించాడు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అని కోరాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World