...

Devotional News : దేవాలయాల్లో ప్రసాదంగా పులిహోర పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా..!

Devotional News : దేవాలయాలను సందర్శించిన సమయంలో దేవుడికి పులిహోరను భక్తులకు నైవేద్యంగా అందిస్తుంటారు. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యంగా ఇస్తుంటారు. అందులో చాలా ప్రత్యేకత ఉంది. పులిహోర అనగానే చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు. అలా దేవుడికి నైవేద్యంగా సమర్పించే నైవేద్యాల్లో పులిహోరకు చాలా ప్రాధాన్యత అందిస్తోంది.

devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu
devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu

పులిహోరకు ప్రత్యేకత రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. పురాణాల్లో పరిశీలిస్తే.. పాండవులలో భీష్ముడు వంటవాడిగా వంటలు చేసేవాడు.. అలాగే ఎన్నో వంటలను అద్భుతంగా భీముడు తయారుచేసేవాడు. ఆ వంటలలో పులిహోర కూడా ఉంది. చోళుల పరిపాలనలో నైవేద్యంగా పూలు, పండ్లు దేవుళ్లకు సమర్పించేవారు. వైష్ణవులు అయ్యంగార్లు సైతం దేవుడికి పులిహోరను నైవేద్యంగా అందించేవారు.

పులిహోర భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. పులిహోర పసుపు వర్ణంలో ఉండటం వల్ల ఈ నైవేద్యాన్ని శుభకరమైనదిగా చూస్తారు. ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మికంగా పులిహోర ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పులిహోర నైవేద్యాన్ని కలియుగ వెంకటేశ్వర స్వామికి రాశిగా పోసి సమర్పిస్తుంటారు. ఈ సేవను తిరుప్పావడ సేవ అని కూడా పిలుస్తారు. హిందూ దేవాలయాల్లో పులిహోరకు ప్రత్యేకత రావడానికి ఇదే.. పులిహోర రుచికి మాత్రమే కాదు.. నైవేద్యంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.

Read Also : Devotional Tips: ఇలా భగవంతుడికి చక్కెర సమర్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా?