మన హిందూ సంప్రదాయాల ప్రకారం దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే హిందువులంతా తమకు నచ్చిన వారాల్లో లేదా ప్రతిరోజూ ఇంట్లోని పూజా మందిరంలో కచ్చితంగా దీపం వెలిగిస్తుంటారు. వారికి వీలయిన సమయాన్ని బట్టి పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేయకూడదని.. మన వేద పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా దీపారాధనకు కూడా నియమ, నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ సమయంలో దీపం వెలిగించే టప్పుడు.. నెయ్యి దీపాన్ని పెట్టేవాళ్లు కచ్చితంగా దేవుడికి ఎడమవైపునే పెట్టాలట. అదే నూనె దీపం అయితే కుడి వైపు వెలిగించాలట. దీపంలో ఎప్పుడూ పత్తితో చేసిన వత్తులను మాత్రమే ఉపయోగించాలి.
అలాగే ఎర్రటి దారంతో చేసిన వత్తులను అస్సలే ఉపయోగించవద్దు. అలాగే ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపు దీపం వెలిగించడం చాలా మంచిది. సూర్యుడు రాకముందే దీపం పెట్టడం మరింత మంచిదని వేద పండితులు సూచిస్తున్ారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు దీపారాధన చేయాలట. అయితే దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచడం వల్ల మనకు మంచి జరుగుతుందట. పశ్చిమ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది.
అయితే మట్టితో చేసిన దీపపు కుందులను వాడే వాళ్లు.. వాటికి పగుళ్ల వస్తే వెంటనే తీసేయాలి. అలాంటి వాటిలో దీపారధాన చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ కల్గుతాయట. అలాగే దీపం వెలిగినంచిన తర్వాత ఆరోపోకుండా జాగ్రత్త పడాలి. దీని కోసం గాజుతో తయారు చేసిన కవచాన్ని ఏర్పాటు చేయాలి. ఏ కారణం చేతనైనా దీపం ఆరిపోతే వెంటనే వెలిగించి భగవంతుడిని ప్రార్థించాలి.