oil price increased : ఈ మధ్య అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, పెట్రోల్, డీజిల్.. ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కడుపు నిండా తినాలంటే కూడా ఆలోచించాల్సి పరిస్థితి వస్తోంది. అన్నంటి ధరలు పెరిగిపోవడమే అందుకు కారణం. అయితే యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు.. గత పదిహేను రోజులుగా కొంత తగ్గుతూ వచ్చాయి. అయితే ఈనెల 28 నుంచి పామాయిల్ ఎగుమతులు నిలిపి వేస్తున్నట్లు ఇండోనేసియా ప్రకటించడంతో నూనెల ధరలు మళ్లీ రాజుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో టోకు వ్యాపారులు పామాయిల్ విక్రయాలను నిలిపి వేశారు. ఈ ప్రభావం అన్ని వంట నూనెల ధరలపై ప్రభావం చూపిస్తోంది. వారం క్రితం లీటరు పామాయిల్ ధర రూ.140కి చేరగా ఇప్పుడు రూ.150.. రేపో, మాపో రూ.160 అయ్యే అవకాశం ఉంది. ‘విజయ’ బ్రాండ్ పొద్దు తిరుగుడు నూనె లీటరు ధర గత నెల ఒకటిన రూ.167 కాగా తాజాగా రైతు బజార్లలో రూ.190కి చేరింది.చిల్లర మార్కెట్లలో ఇప్పటికే లీటరు రూ.200కి అమ్ముతున్నారు. తెలంగాణలో వినియోగించే వంటనూనెల్లో పామాయిల్ అమ్మకాలే 60 శాతానికి పైగా ఉండటంతో దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది.
Read Also :Business Idea : రెండు లక్షల పెట్టుబడి పెడ్తే చాలు.. ఇలా నెలకు 50 వేలు ఈజీగా సంపాదించొచ్చు!