కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తీసిని మా ఇష్టం (డేంజరస్) సినిమాకు హెదారాబాద్ సిటీ సివిల్ కోర్టు బ్రేక్ వేసింది. తనకు వాయిదా పద్ధతిన ఇవ్వాల్సిన రూ.50 లక్షలు ఇవ్వడం లేదని తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్, కుమారుడు నట్టి క్రాంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గురువారం కేసును విచారించిన న్యాయస్థఆనం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సినిమా విడుదలను ఆపేయాలని రాం గోపాల్ వర్మకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా ఏ ఆన్ లైన్ వేదికలోనూ విడుదల చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కేసు తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.
మరోవైపు డేంజరస్ విడుదలకు థియేటర్లు సహకరించకపోవడం వల్ల సినిమా వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. సినిమాను ఎలా ప్రేక్షకులకు చేరువ చేయాలో తెలుసని పేర్కొన్న వర్మ… త్వరలోనే మరో విడుదల తేదీని వెల్లడించనున్నట్లు తెలిపారు. స్వలింగ సంపర్కులైన ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమను క్రైమ్ డ్రామాగా వర్మ డేంజరస్ ను రూపొందించారు.