...
Telugu NewsEntertainmentKeerthy Suresh : నా భర్త ఎలాంటి వాడంటే? ఒక్క మాటలో అసలు నిజాన్ని బయటపెట్టేసిన...

Keerthy Suresh : నా భర్త ఎలాంటి వాడంటే? ఒక్క మాటలో అసలు నిజాన్ని బయటపెట్టేసిన కీర్తి సురేశ్..!

Keerthy Suresh : తెలుగుసినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించింది తక్కువ సినిమాలే. అయినా మంచి సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. దాంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ గ్రాఫ్ పెరిగిపోయింది. అప్పట్లో బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకుంది. కానీ, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇటీవలే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించింది. ఇప్పుడు కీర్తి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా తన భర్త వ్యక్తిత్వం గురించి పొగడ్తలతో ముంచెత్తుతోంది కీర్తి.

Advertisement

ఇంతకీ ఆ విషయాలు ఏంటో మనం ఓసారి చూద్దాం.. తన భర్త గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె బయటపెట్టారు. ముఖ్యంగా తన భర్త మనస్తత్వం సిగ్గుపడే మనస్తత్వమని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. తన భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్‌‌లో ఉంటుందని, తన భర్త మీడియాకు దూరంగా ఉండేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారంటూ కీర్తి సురేష్ తెలిపింది. తామిద్దరం ఏ ప్రాంతానికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు తీస్తుండటంతో తన భర్త కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని కీర్తి సురేష్ చెబుతోంది. ఇప్పుడా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Keerthy Suresh : భర్త గురించి అసలు సీక్రెట్ చెప్పిన కీర్తి సురేష్

ఇంతకీ కీర్తి సురేష్ తన భర్త పేరు ఏంటో చెప్పలేదు కదా… ఆయన పేరు.. ఆంటోని థట్టిల్. ఈ క్యూట్ కపుల్ జోడీ ఎంతో చూడముచ్చటగా ఉందని నెటిజన్లు అంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కీర్తి సురేష్ ఎంతో ట్రెడిషనల్ కనిపించేందుకు ఇష్టపడుతుంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఈవెంట్ కు వెళ్లిన సమయంలో కూడా మెడలో తాళితోనే కనిపించింది. కీర్తి సురేష్‌కు భర్త ఆంటోని చిరకాల మిత్రుడు కూడా. ఇటీవల పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ తన బోల్డ్ ఫొటోలను షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

కెరీర్ విషయానికి వస్తే.. కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ మూవీలతో ఆమె కెరీర్ దూసుకెళ్తోంది. తెలుగులో కీర్తి సురేష్ బాగా బిజీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆమెకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోవడంతో కీర్తి సురేశ్ అభిమానించే అభిమానుల సంఖ్య అలానే పెరుగుతువస్తున్నారు. కీర్తి సురేష్ మరిన్ని స్టార్ హీరోల మూవీల్లో నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Advertisement

Read Also : Virender Sehwag : వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి విడాకులు..? ఇందులో నిజమెంత? 20ఏళ్ల కాపురానికి వీడ్కోలు పలకనున్నారా?

Advertisement
Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు