...
Telugu NewsLatestPushpa movie fever: జవాబులు రాసేదె లే అంటూ పదో తరగతి బాలుడి ఆన్సర్.. ఎక్కడో...

Pushpa movie fever: జవాబులు రాసేదె లే అంటూ పదో తరగతి బాలుడి ఆన్సర్.. ఎక్కడో తెలుసా?

పుష్ప సినిమా వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా… ఆ సినిమా ఫీవర్ మాత్రం ఇంకా వదలట్లేదు. సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ… ఆ సినిమా డైలాగులు, పాటలు, డ్యాన్సులను అభిమానులంతా తమ తమ స్టైల్ లో చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇలాంటివే చూశాం. కానీ ఓ పదో తరగతి బాలుడు ఈ సినిమా డైలాగ్ ని పరీక్షల్లోని జవాబుల పత్రంలో రాశాడు. అయితే ఈ ఘటన బెంగాల్ లో చోటు చేసుకుంది.

Advertisement

పుష్ప.. పుష్పరాజ్ డైలాగ్ ను అనుకరిస్తూ… ఓ పదో తరగతి విద్యార్థి త జవాబు పత్రంలో ఇదే డైలాగ్ రాశాడు. పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే అని రాసి పెట్టాడు. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడు దీన్ని చూసి తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోక చాలా సేపు నవ్వుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశాడు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు