బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబ్ నటి సిరి హన్మంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ కు వెళ్లక ముందు సిరి హన్మంత్, శ్రీహాన్ ల ప్రేమ గురించి అందరికీ తెలుసు. కానీ సిరి బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయింది. అంతే కాకుండా షణ్ముఖ్ జష్వంత్ తో బాగా క్లోజ్ గా ఉండటం, హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వీరిద్దరూ బాగా నెగిటివిటీని సొంతం చేసుకున్నారు.
అయితే హూస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ చాలా దూరంగా ఉన్నారు. అందుకు కారణం షణ్ముఖ్, దీప్తి సునైన మధ్య మరియు సిరి, శ్రీహాన్ ల మధ్య గొడవలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. అందుకు ఆజ్యం పోసినట్లుగా… షణ్ముఖ్, దీప్తి విడిపోయారు. ఆ తర్వాత సిరి, శ్రీహాన్ లు కూడా విడిపోబోతున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలోనే శ్రీహాన్ సిరికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి డిలీట్ చేశాడు. కానీ తాజాగా సిరి.. శ్రీహాన్ తో కలిసి దినన ఒక ఫొటోను షేర్ చేస్తూ… ”ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం అన్ని ఇతనే. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.