చైత్ర పూర్ణిమ ఏప్రిల్ 16వ తేదీన వస్తోంది. అయితే శుక్రవారం రోజు అంటనే నేటి ఉదయం 5.55 నుంచి రవి యోగం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సందర్బంగా మీరు కొన్ని రకాల పూజ చేయడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంటిని వదిలి వెళ్లదు. అయితే అష్ట ఐశ్వర్యాలను పెంచుకోవచ్చు. అయితే అవేంటో, ఆ పూజలు ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి ప్రతి నెల శుక్ల పక్షం 15వ రోజు వస్తుంది. ప్రస్తుతం చైత్రమాసం శుక్ల పక్షం జరుగుతోంది.
ఈ రోజున ఉదయం 5.5 నుంచి 8.40వరకు రవియోగం ఉంటుంది. చైత్ర పూర్ణిమ సందర్భంగా పుణ్య నదుల్లో స్నానం చేసి దానాలు చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఇళ్లలో సత్యనారాయణ కథను చదవి చంద్రుడికి పూజలు చేయాలి. చైత్ర పూర్ణిమ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి జన్మించిన తేదీ. పౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని పూజించాలనే ఒఖ ఆచారం ఉంది. ఈ సందర్భంగా మీరు కొన్ని ఉపాయాలు చేయడం ద్వారా మీ సంపద, ఆస్తి, ఆనందం, శ్రేయస్సును పెంచుకోవచ్చు.
1. చైత్ర పూర్ణిమ సందర్భంగా రాత్రిపూట లక్ష్మీ దేవికి ఖీర్ లేదా ఏదైనా తెల్లటి స్వీట్ ను సమర్పించండి. దీంతో లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. ఆమె దయ వల్ల మీ ఇల్లు ధనం, ధాన్యాలతో నిండిపోతుంది.
2.చైత్ర పూర్ణిమ నాడే ఆంజనేయ స్వామి జయంతి. ఈరోజు మీరు హనుమంతుడి మంత్రం ఓం నమో భగవతే హనుమంతే నమః అని కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. సంక్షోభం కూడా తీరిపోతుంది.
3. తామర పువ్వు లేదా ఎర్ర గులాబీలతో లక్ష్మీ దేవిని పూజించండి. పూజలో తమలపాకులను సమర్పించండి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడటం ప్రారంభం అవుతుంది. డబ్బు కొరత కూడా తీరుతుంది.
4. చైత్ర పూర్ణిమ రోజున మీరు లక్ష్మీ దేవిని, గణేషుడిని కలిసి పూజించాలి. మీ ఇంటికి ఏ డబ్బు వచ్చినా అది స్థిరంగా ఉంటుంది . ఆ డబ్బు స్థిరత్వం పొందుతుంది.
5. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి చైత్ర పూర్ణిమ నాడు శ్రీసూక్తాన్ని పఠించండి. లక్ష్మీ మాత మీ దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది. సంపద ఆస్తి పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.
6. చైత్ర పూర్ణిమ రాత్రి చంద్ర భగవానుడిని పూజించండి. ఆవు పాలలో తెల్లటి పూలు, పంచదార, అక్షతలను కలిపి చంద్ర భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ సమయంలో ఓం ఐం క్లీం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీ ఆనందం, సంపద పెరుగుతాయి.