Zodiac Signs: మే నెల 2022లో మకర రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహువు, శని, కేతువుల సంచారాల వల్ల మిశ్రమల ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే మనసులో గట్టిగా అనుకున్న పనిని కచ్చితంగా పూర్తి చేస్తారు. చేద్దాంలే, అవుతుందో లేదో అనుకున్న పని మాత్రం కాకపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చేసే ఏ పని మీదైనైనా పూర్తి నమ్మకం పెట్టి చేయండి. అంలాగే ఉత్సాహం తగ్గకుండా బాధ్యతలను పూర్తి చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు.
కాకపోతే మీకు ఓ పెద్ద సమస్య వచ్చి పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు వెళ్లడం, మధ్య వర్తిత్వం వంటివి చేయకండి. అయితే ఆర్థికంగా మాత్రం చాలా బాగుంది. ఇందులో ఎటువంటి సమస్యా లేదు. అయితే అందరితో కలిసి చేసే పనుల్లో మీకు చాలా లాభం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసర. రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సూర్యా నారాయణ మూర్తిని స్మరించడం వల్ల మంచి జరుగుతుంది.