Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఎపిసోడ్ 11వ వారంలోకి ప్రవేశించింది. రసవత్తరంగా షో రన్ అవుతూ ఉంది. జెస్సీ అనారోగ్యంతో అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో ఎవరో ఒకరు నామినేషన్స్ లో ఉన్న వారు సేవ్ అయ్యారు. బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది. ఈ డ్రామా బెస్ట్ అయిన సిరి, షణ్ను మధ్య జరిగింది. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని బిగ్ బాస్ హౌజ్ లో పేరు తెచ్చుకున్నారు. వారితో పాటు జెస్సీ కూడా ఉండి ఉంటే వారిని త్రిమూర్తులుగా పిలిచేవారు. కానీ జెస్సీ అనుకోకుండా బయటకు పోవడంతో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలారు.
ఒంటరిగా కూర్చున్న షణ్ముక్ సిరితో నేను ఆడడం వల్ల నువ్వేమీ తక్కువ అయిపోవు. దానికే వచ్చినట్లున్నావు. నువ్వు వెళ్లు అని చెప్పడంతో సిరి తన మొహాన్ని చేతులతో కొట్టుకుని ఏడుస్తుంది. నేనే ఆ మాట అన్నాను నాదే తప్పు అంటూ షణ్ను మరోసారి సిరిని ఉద్దేశించి అంటాడు. షణ్ను ఎమోషనల్ అవుతున్నాడని సిరి సముదాయించే ప్రయత్నం చేయగా.. తాను ఉండుంటే బాగుండు నేను మరీ ఒంటరిని అయిపోయానని షణ్ముక్ అంటాడు.
దానికి సిరి మరో నాలుగు వారాలే వెళ్దాంలే అని అంటుంది. ఆ మాటకు షణ్ముక్ నేను ఎప్పుడు వెళ్లాలో నాకు తెలుసు. నీవు వెళ్లు అని అంటాడు. దానికి మరింతగా హార్ట్ అయిన సిరి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. తను బాత్రూమ్ లోకి వెళ్లి గడియ వేసుకుంది. ఈ తతంగం మొత్తం బయటి నుంచి చూస్తున్న రవి వాళ్లిద్దరూ ఏడుస్తున్నారని అంటాడు. దానికి సన్నీ ఆ ఇద్దర్నీ బయటకు తీసుకొచ్చి కూర్చుండబెడదాం అని రవితో చెప్పగా రవి వారికి స్పేస్ కావాలి వదిలెయ్ అని అంటాడు.
Read Also : Madhavi Latha : బిగ్‌బాస్‌ని బ్యాన్ చేయాలి.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world