...

Madhavi Latha : బిగ్‌బాస్‌ని బ్యాన్ చేయాలి.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..! 

Madhavi Latha : టాలీవుడ్ నటి మాధవీలత మరోసారి బిగ్ బాస్ షోను ఏకిపారేసింది. ఆ షోలో అనాగరిక పద్ధతులు ఉన్నాయని పేర్కొంది. పాత రోజుల్లో గ్రామాల్లో ఉన్న విధంగా ఇప్పుడు ఇక్కడ అనేకం జరుగుతున్నాయని ఏకిపారేసింది. చివరికి హోస్ట్ నాగ్ ను కూడా చెడా మడా కడిగిపారేసింది. తనకే హోస్ట్ గా అవకాశం వస్తే ఈ బిగ్ బాస్ షోను రోస్ట్ చేస్తానని చెప్పింది.

Advertisement

బిగ్ బాస్ షోలో జరిగిన అనాగరిక చర్య తన దృష్టికి వచ్చిందని ఆమె చెప్పింది. నాగరిక సమాజంలో బతుకుతూ ఒక మనిషి సూసైడ్ చేసుకునే విధంగా చేయడం అనాగరికం అని మాధవీలత పేర్కొంది. పాత రోజుల్లో గ్రామాల్లో ఉండే విధంగా సగం గుండు గీకడం, సగం మీసం గీకడం వంటివి చేసేవారని ఇప్పటికీ బిగ్ బాస్ షోలో అదే అనాగరికపు పోకడలు ఉన్నాయని ఆమె పేర్కొంది. బిగ్ బాస్ షోను రివ్యూ చేసే మినిస్ట్రీ మీద తనకు అధికారం ఇస్తే ఆ షోకు 100 కోట్ల జరిమానా వేస్తానని చెప్పుకొచ్చింది.

Advertisement

అనాగరికంగా నడుస్తున్న బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని మాధవీలత కోరింది. సామాజిక కార్యకర్తలు, విలేకరులు బిగ్ బాస్ షోలో జరుగుతున్న అనాగరిక విషయాలను గురించి మాట్లాడడం లేదని ఆమె మండిపడింది. జైలుకు వెళ్లాలని మనుషులను హింస పెడుతున్నారు. అంతే కాకుండా వారి మెడలో బోర్డులు తగిలించి తిప్పుతున్నారని తెలిపింది. అసలు బిగ్ బాస్ టీం మానసిక స్థితిగతులు ఏమిటని ఆమె ప్రశ్నించింది.

Advertisement

మీరు చూపిస్తున్నది చూసి బయట కూడా అనేక మంది ఓడిపోయిన వారిని సరదాగా మెడలో బోర్డులు వేసి తిప్పుతున్నారని ఈ పద్ధతులు ఆపండని ఆమె షో యాజమాన్యానికి తెలిపింది. మీ కోసం ఇప్పుడు కందుకూరి విరేశలింగం గారు, రాజా రామ్ మోహన్ రాయ్ గారు రాలేరు కదా అంటూ చురకలంటించింది.

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరిపై సీరియల్ హీరో నందు షాకింగ్ కామెంట్స్..!

Advertisement
Advertisement