Bigboos 5 telugu: తెలుగు రియాలిటీ షోస్ లో బిగ్‌బాస్ కు మంచి ఆదరణ ఉంది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 5వ సీజన్ లోకి వచ్చింది. నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ షో ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. వచ్చేవారంతో బిగ్ బాస్ షో కంప్లీట్ కాబోతోంది.
ఇక ఈ సీజన్ లో టాప్ 5 లో ఉంటాడనుకున్న యాంకర్ రవి అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఆందోళన చేయడంతో బిగ్ బాస్ 5పై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో యాంకర్ రవి తల్లి ఉమారాణి రవి ఎలిమినేషన్ పై తీవ్రంగా స్పందించారు. షో పై కీలకవ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ షో గురించి ఉమారాణి మాట్లాడుతూ.. ‘నా కొడుకు టాప్ 5లో ఉండాల్సిన వాడు. ఇలా ఎలిమినేట్ అవడం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. వాడు గేమ్ ఆడాడు. పిచ్చి చేష్టలు చేయలేదు. ఊరికే కూర్చుని తినలేదు. తెలివిగా ఆడాడు. బిగ్ బాస్ వాళ్ళకి మంచివాళ్లు, ఆటఆడేవాళ్ళు అవసరం లేదని అర్ధమైంది. రవిని కావాలని పిలిచి తీసుకెళ్ళారు. కానీ వాడికి ఆ హోదా ఇవ్వలేదు’ అంటూ ఉమారాణి మండిపడ్డారు.
Read also : ఏంట్రా ఇది.. షణ్ముక్ కాదు.. కాజల్ ఔట్!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world