Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆరుగురు కంటెస్టెంట్ల నుంచి నిన్న ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకు రావడంతో టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరు ఫైనలిస్టులని నాగ్ అనౌన్స్ చేశాడు. ఇక వచ్చే వారమే ఈ షోకు పుల్ స్టాప్ పడనుంది. ప్రస్తుతం టాప్ 5 గా హౌస్ లో సిరి, శ్రీరామచంద్ర,, మానస్, షన్ను, సన్నీ ఉన్నారు. వీరిలో నుంచి ఎవరో ఒకరు బిగ్ బాస్ 5 సీజన్ టైటిల్ గెలవబోతున్నారు.
నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కాజల్ షన్ను మీద పలు ఆరోపణలు చేసింది. అంతే కాకుండా నిన్న ఇదివరకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రియాంక మరియు జెస్సీలతో నాగ్ మాట్లాడించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక మానస్ ను ఒక ప్రశ్న అడిగింది? ఇన్ని రోజులూ నన్ను భరించావా? లేక నటించావా? అని అడిగింది. దానికి మానస్ సమాధానం చెబుతూ ఖచ్చితంగా భరించాను అని పేర్కొన్నాడు. ఇక జెస్సీ సిరి, మరియు షన్నులతో మాట్లాడాడు.
కాజల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే సన్నీ మరియు మానస్ ఫుల్ ఎమోషన్ అయ్యారు. స్టేజి మీదకు వచ్చిన కాజల్ సన్నీ ఐదు రెట్ల ఎంటర్ టైన్ మెంట్ ఇస్తే, మానస్ ఐదు రెట్ల ఫ్రెండ్ షిప్ చేస్తాడని పేర్కొంది. మరియు సిరి ఐదు రెట్ల ఎమోషన్ ఇస్తే, శ్రీ రామ చంద్ర ఐదు రెట్ల యాక్షన్ చేస్తాడని తెలిపింది. ఇక షన్ను విషయంలో కాజల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
షణ్ముక్ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని కాజల్ పేర్కొంది. సిరిని కంట్రోల్ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం ఇలా ప్రతి దాంట్లోనూ షణ్ముక్ డ్రామా ఉంటుందని కాజల్ తెలిపింది. ఇక కాజల్ ఎలిమినేట్ అయిపోవడంతో హౌస్ లో సందడి అనేది లేకుండా పోతుందని మరో కంటెస్టెంట్ సన్నీ అన్నాడు. ఈ సీజన్ ముగింపు ఎలా ప్లాన్ చేస్తారా అని చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
Read Also : Surveen Chawla : బోల్డ్ బ్యూటీ సుర్వీన్ చావ్లాను అంత మాటన్న ఫేమస్ డైరెక్టర్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world