Anasuya : జబర్దస్త్ కార్యక్రమం అత్యధిక రేటింగ్ కైవసం చేసుకొని నెంబర్ వన్ కామెడీ షో గా దూసుకుపోతుంది. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో నెంబర్ వన్ షోగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు న్యాయ నిర్ణయతగా వ్యవహరించేవారు. నాగబాబు ఈ కార్యక్రమం నుంచి దూరం కాగానే వరుసగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వలసలు మొదలయ్యాయి. నాగబాబు వెంట ధనరాజ్, ఆర్పీ, చమ్మక్ చంద్ర వంటి వాళ్ళు బయటకు వెళ్లారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా రోజా ఉండేది. ఈమెకు కూడా మంత్రి పదవి రావడంతో రోజా సైతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు. ఇక రోజా బయటకు వెళ్లడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి పెద్ద ఎత్తున బయటకు వెళ్లారు.హైపర్ ఆది సుడిగాలి సుధీర్ గెటప్ శీను వంటి వాళ్ళు ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి బయటకు పోవడంతో ఈ కార్యక్రమానికి రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఇకపోతే తాజాగా అనసూయ సైతం ఈ కార్యక్రమం నుంచి తప్పుకోబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు.
అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు రావడంతో ఈమె వెండితెరపై బుల్లితెరపై నటించడానికి కాల్ షీట్స్ కుదరకపోవటం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.అయితే ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేయడంతో అందరికీ అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే అనసూయ నిజంగానే సినిమాల కారణంగా ఈ కార్యక్రమంలో కారణం ఉందా అనే విషయం తెలియాలంటే అనసూయ స్పందించాల్సిందే.
Read Also : Vishnu Priya Dance : చిట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న విష్ణుప్రియ.. వీడియో