...

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై అభిమానంతో వీపుపై టాటూ వేయించుకున్న అమ్మాయి..?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఈయన హీరోగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. విజయ్ దేవరకొండకు ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఒకసారి కలిస్తే చాలు అని ఫీలయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులు ఆయనను కలిశారు.ఇలా ఈ ఇద్దరు అమ్మాయిలు విజయ్ దేవరకొండను కలిసి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా అతనితో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అయితే ఇలా తమ అభిమాన నటుడిని కలుసుకోవడంతో ఒక్కసారిగా ఆ యువతి ఎంతో ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ అంటే తనకి ఎంత ఇష్టమో ఈ సందర్భంగా బయటపెట్టారు.అమ్మాయి ఏకంగా తన వీపుపై విజయ్ దేవరకొండ ఫేస్ టాటూ వేయించుకుంది.

ఇక ఈ టాటూ చూసిన విజయ్ దేవరకొండ ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని లైగర్ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో షేర్ చేసిన మేకర్స్.. సూపర్ ఫ్యాన్ మూమెంట్ కొందరు తమపై అభిమానంతో ఈ విధంగా టాటూలు వేయించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఈ వీడియో వైరల్ కావడంతో కొందరు విజయ్ దేవరకొండ పై ఉన్న అభిమానంతో యువతి చేసిన పనికి సంతోషపడగా మరికొందరు మాత్రం అభిమానం ఉంటే మాత్రం అలా వీపుపై టాటూ వేయించుకోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.