Chanakya nithi : ఆచార్య చాణక్యుడు చెప్పిన సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి ఎన్నో విషయాలు చర్చించారు. భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేస్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో కూడా ఆయన వివరించారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యాభర్తల బంధంలో ముఖ్యంగా అనుమానాలు ఉండకూడదు. ఏ రిలేషన్ ను అయినా బ్రేక్ చేసేది అనుమానమే. ఇధి అపార్ధాలకు దారి చీస్తుంది. తర్వాత ఈ విషం కారణంగా జీవితాలే నాశనం అవుతాయి. ఒక్కసారి అనుమానం రోగం పట్టుకుంటే అంత తేలికగా పోనే పోదు.
వైవాహిక జీవితాన్ని నాశనం చేయడంలో అహం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కూడా సంబంధాలను తెంచేయగలదు. అహానికి పోకుండా సర్దుకుపోతే అందరూ బాగుంటారు. భార్యాభర్తల మధ్య దీనిక అహానికి అస్సలే తావివ్వకూడదు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉండాలంటే అందులో అబద్ధాలకు తావు ఉండకూడదు. అబద్ధాలు భార్యాభర్తల మధ్య సంబంధాలను బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తాయి. కాబట్టి మీరు దానికి దూరంగా ఉండాలి.
భార్యాభర్తల మధ్య బంధాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇది అవగాహన పరస్పర సమన్వయంతో జరగాలి. గౌరవం అనేది బలమైన, దీర్ఘకాలం ఉండే ఏ బంధానికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, ఆ సంబంధంలో చీకట్లు కమ్ముకుంటాయి. ఆ సంభంధం ఆనందంగా ముగుస్తుంది. ఈ పరిమితులను ఎవరూ దాటకూడదు.
Read Also : Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!