Health Tips : సంపూర్ణ భోజనామృతం అంటే చివరన పెరుగుతో తింటేనే అని చాలామంది ఫాలో అవుతారు. రకరకాల వంటకాలతో విందు భోజనం తిన్న తర్వాత కూడా ఒక ముద్ద పెరుగన్నం లేకపోతే సంతృప్తిగా ఉండదు. పెరుగన్నం తినడం వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కొంతమంది పెరుగును చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ పెరుగులో ఉన్న పోషక విలువలు, ప్రయోజనాలు తెలుసుకుంటే మీకే పెరుగు తినాలి అనిపిస్తుంది. అవేంటో మీకోసం…
- ఒకపూట భోజనానికి సమానమయ్యే 100 గ్రాముల పెరుగన్నం రెండున్నర గంటల వరకు ఆకలిని అదుపులో ఉంచుతుంది.
- 89 శాతానికి పైగా నీటిని కలిగి ఉండే పెరుగులో నాణ్యమైన ప్రోటీన్లు, దాదాపు అన్ని రకాల ఎమినో యాసిడ్‌లు, కాల్షియం తగినస్థాయిలో లభిస్తాయి.
- ఆహారం జీర్ణం కావడానికి పెరుగు తోడ్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు సహకరిస్తాయి.
- ఎముకల బలానికి పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి. కాబట్టి నిత్యం పెరుగు తీసుకుంటే ఎముకల ఆరోగ్యానికి మంచిది.
- అలానే పెరుగు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి రక్తపోటుని అదుపులో ఉంచే శక్తి ఉంటుంది. రక్తనాళాల్లో, శరీరంలో కొవ్వు చేరకుండా నివారించే శక్తి పెరుగుకు ఉంటుంది.
- బరువు తగ్గించడంలో కూడా పెరుగు బాగా తోడ్పడుతుంది. పెరుగులో ఉన్న క్యాల్షియం శరీరంలో కార్టిసాల్ అనే స్టిరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. ఈ కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువైనా, సమతౌల్యం కోల్పోయినా జీవనశైలికి సంబంధించిన వ్యాధులు హైపర్ టెన్షన్, ఒబెసిటీ లాంటివి వస్తాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ డైట్ లో పెరుగు ఉండాల్సిందే.
- కురుల ఆరోగ్యానికి పెరుగులో ఉండే విటమిన్ సి, జింక్, క్యాల్షియం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలున్న లాక్టిక్ యాసిడ్ కురుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పెరుగును తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
- పెరుగు తింటే… మెదుడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. పైల్స్ మొలల సమస్యతో బాధపడేవాళ్లకు పెరుగు చక్కటి పరిష్కారం. నిత్యం పెరుగన్నం తీసుకుంటే పైల్స్ ను అరికడుతుంది.
Read Also : Bride Dance Viral : బుల్లెట్ బండి పెళ్లికూతురు పాటను మరిపించిన మరో కొత్త పెళ్లికూతురు.. వీడియో చూశారా?
Tufan9 Telugu News And Updates Breaking News All over World