Gold prices today : ఈ వారం పసిడి ధరలు ఎలా ఉండొచ్చంటే..?

Gold prices today : మూడు రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం శాంతించాయి. పసిడి రేటులో మే 23న ఎలాంటి మార్పు లేదు. బంగారం స్థిరంగానే ఉంది. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.47, 050, రూ,51,330 వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధరలు గత మూడు రోజుల కాలంలో వెయ్యుకి పైగా పరుగులు పెట్టాయి. బంగారం ధరలు నిలకడగానే కొనసాగుతూ ఉండే వెండి రేటు కూడా ఇదే దారిలో కనసాగింది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ. 65, 900 వద్దనే ఉంది.

Gold prices today
Gold prices today

అయితే రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ విపుల్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ… ఈ వారం బంగారం ధరలను డాలర్ ఇండెక్స్ నిర్ణయిస్తుంది. డాలర్ ఇండెక్స్ కదలిపకలపై ఆధారపడి బంగారం ధరల మూమెంట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఇటీవల 105 స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు 103 స్థాయికి దిగి వ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వు బుధవారం రోజున తన లేటెస్ట్ మీటింగ్ మినిట్స్ ను విడుదల చేయనుందని వివరించారు. దీని ద్వారా తదుపరి వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన సంకేతాలను గమనించ వచ్చని పేర్కొన్నారు.

Read Also : Gold prices today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel