Health Tips: శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది..!

Health Tips: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.పైసా వచ్చే ఆయాసం లేకుండా పుట్టిన పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్య తీవ్రత ఎక్కువ కాకుండా నియంత్రించవచ్చు. శ్వాసకోస సమస్యలు ఉన్న వారు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటుంటారు. కొంతమందికి మాంసం లేనిదే ముద్ద దిగదు. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారు మాంసాహారం తక్కువ తీసుకోవటం శ్రేయస్కరం.ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు చేపలను ఎక్కువగా తినటం వల్ల వారి సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది . శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చేపలకు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisement

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..పాలలో ఉండే అనేక రకాల పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడతాయి. శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు పాలను ఎక్కువగా తాగటం. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కాకుండా అంతకు మించి పాలు తాగటం వల్ల దగ్గు గొంతు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పాలు తక్కువ తాగటం మంచిది.

ఆస్తమా సమస్యలతో బాధపడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆస్తమా సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ తాగడం వల్ల అందులోని సల్ఫైట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. అందువల్ల ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు బీర్, ఆల్కహాల్ తాగకపోవటం మంచిది.

Advertisement