Radish Benefits : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాంట్ ఆనందం కోసం చేస్తున్న మానవ ప్రయత్నాలు అన్నీ భవిష్యత్‌లో ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆహారం తీసుకున్నాక వాక్ చేయకపోవడం, తింటూ టీవీ చూడటం, ఆలస్యంగా నిద్ర లేవడం, లేటుగా నిద్రపోవడం, పోషకాహారలోపం ఉన్న ఫుడ్ తీసుకోవడం వలన సమీప భవిష్యత్ లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అతిగా ఆలోచించడం, పని ఒత్తిడి వలన మెదడుకు సరిగా రక్తప్రసరణ కాదు.. ఫలితంగా శరీరంపై అనేక దుష్పలితాలు కలుగుతాయి. అయితే, చలికాలంలో లభించే ముల్లంగి దుంపల వలన కొంతమేర మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ముల్లంగిని వంటింట్లో సాంబార్, పచ్చడి, కూరగాను వాడుతుంటారు. ముల్లంగి తినడం వలన బీపీ, గుండె జబ్బులు, కంటిసమస్యలు, ఆకలి సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా నయం అవుతాయట..చాలా మందికి ముల్లంగి ఉపయోగాలు తెలియక దానిని తినకుండా దూరం పెడుతుంటారు. ఇందులో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, పోటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ మరియు ఫైబర్ గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముల్లంగిని తరచూ తీసుకుంటుంటే అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. బీపీ ఎక్కువ, తక్కువగా కాకుండా సరైన మోతాదులో ఉంచేందుకు దోహదపడుతుంది. ముల్లంగిలో విటమిన్-సి ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వలన సాధారణ జలుబు, ఫ్లూ, దగ్గు మరియు ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. గుండెకు రక్తప్రసరణ మెరుగ్గా అయ్యేలా చూస్తుంది. ముల్లంగిలోని ఆంథోసైనిన్ అనే పోషకాలు గుండె కండరాలను బలంగా చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ కూరగాయలో కొల్లాజెన్ అనే పోషకాలుంటాయి. రక్తనాళాలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇక కడుపుకు సంబంధించిన సమస్యలు, అసిడిటీ, గ్యాస్, అజీర్తి, జీర్ణసమస్యలకు ముల్లంగితో చెక్ పెట్టవచ్చును.
Read Also : Health Tips : తుమ్మి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…!