Health Tips : ప్రకృతిలో పెరిగే ఎన్నో రకాల మొక్కలు, చెట్లు ఔషధ గుణాలను కలిగి ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆ మొక్కలు, వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన లేకపోవడంతో ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. ఇలా ప్రకృతిలో పెరిగే తుమ్మిమొక్క ఎన్నో సద్గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. తుమ్మి చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా తుమ్మి మొక్కలు వర్షాకాలంలో పంటపొలాల్లో ఎక్కువగా పెరుగుతుంటాయి. చాలామంది ఈ ఆకులతో కూరలు తయారు చేసుకునే తింటుంటారు. ఇలా తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఈ ఆకులను మెత్తగా రుబ్బి వాటి రసం రోజుకు రెండు స్పూన్లు తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోయి అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. తేలు పాము వంటి విష పురుగులు కుట్టినప్పుడు ఈ ఆకులను మెత్తగా రుబ్బి కుట్టిన చోట ఆకులను పెట్టి కట్టు కట్టాలి . ఈ ఆకుల నుండి తీసిన రసం వారికి తగించటం వల్ల విష ప్రభావం నుండి బయట పడవచ్చు.
గజ్జి , తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ ఆకులను మెత్తగా రుబ్బి ఆ రసాన్ని చర్మానికి రాయడం వల్ల వారి సమస్యలు తొందరగా నయమవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధ పడేవారు తొమ్మిది ఆకులను మెత్తగా రుబ్బి నొప్పి ఉన్న ప్రదేశంలో పూతగా అంటించి కట్టు కట్టాలి.ప్రతి రోజు ఇలా చేయటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా స్త్రీలలో ఋతుక్రమం సమయంలో అధిక రక్తస్రావం జరిగినప్పుడు ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల వారి సమస్య తగ్గుతుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ తుమ్మి మొక్కలు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతాయి.
Read Also :Dusara theega : ఈ మొక్క ఆకుల రసం రోజూ తాగారంటే… ఆరోగ్యంగా ఉండొచ్చు!
Tufan9 Telugu News And Updates Breaking News All over World