Diabetes : ఈ మధ్య కాలంలో డయాబెటిస్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు డయాబెటిస్ చుట్టు ముడుతోంది. వయస్సు మీద పడే కొద్దీ వచ్చే ఈ జబ్బు, మధ్య వయస్సు వారినీ ఇబ్బంది పెడుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం ఇతర ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. అయితే ఆహారం తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాలు పాటిస్తే మధుమేహాన్ని క్రమంగా తగ్గించవచ్చు.
షుగర్ ను కంట్రోల్ చేయడంలో కాకరకాయను మించింది లేదు. కాకరకాయ రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ క్రమంగా తగ్గుతుంది. కాకరకాయ రసంలో ఎలాంటి తీపి పదార్థాలు జోడించకుండా తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. రోజూ ఉదయం అర గ్లాస్, సాయంత్రం అర గ్లాస్ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే రోజూ వాకింగ్, నెమ్మదిగా పరిగెత్తడం చేయాలి.
Diabetes : డయాబెటిస్ సమస్యను ఈజీగా కంట్రోల్..
రోజూ 20 నుండి 30 నిమిషాల పాటు శారీరక శ్రమ కలిగించాలి. అలాగే కంటి నిండ నిద్రపోవాలి. వ్యక్తులను బట్టి 6 నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. అలాగే జిల్లేడు ఆకును అరికాళ్ల కింద పెట్టుకుని సాక్సులు ధరించాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే ఉంచి రాత్రి పడుకునే సమయంలో తీసేయ్యాలి
Read Also : Custard apple side effects : రుచిగా ఉన్నాయని సీతాఫలాలు తెగ లాగించేస్తున్నారా, అయితే కష్టమే!