...

Health Tips : రాత్రి పూట నిద్ర పట్టడం లేదా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !

Health Tips : ఆకలి, నిద్ర అనేవి జీవులందరికీ సర్వసాధారణం. అయితే మారుతున్న బిజీలైఫ్​ కారణంగా మనుష్యులంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం అని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే నిద్రలేమి కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారంతా రాత్రుళ్లు నిద్ర పట్టక, ఏం చేయాలో తోచక… మరోవైపు ఉదయం అవుతూ ఉండడంతో సతమతం అవుతూ ఉంటారు. ఇక అదే ఉరుకులు పరుగుల జీవితంలో ఈ సమస్యతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ సమస్యలతో బాధ పడే వారి కోసమే ఈ చిట్కాలు…

  • నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.
  • ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు, బెడ్ రూం లైటింగ్, దుప్పట్లు లాంటివి మీకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇటీవల కాలంలో నిద్ర రావడానికి కూడా ఓ చక్కని టీ వచ్చింది. అదే బనానా టీ. అరటి పండుతో ఈజీగా చేసుకొనే ఈ టీని రాత్రి పడుకునే ముందు తాగితే చాలు. మీరు కంటినిండా నిద్ర పోవచ్చు.
health-tips-for-sleeping-problems
health-tips-for-sleeping-problems
  • గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. పడుకునే ముందు నాటు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
  • చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.
  • రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది.Read Also : Devotional News : ఎంత కష్టపడ్డా ఇంట్లో డబ్బు సమస్య ఉంటుందా… అయితే ఇవి పాటించండి !