Health Tips : మనిషి ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరానికి మెదడుకు ప్రశాంతమైన నిద్ర ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే ఎంతో చురుగ్గా ఉంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు పలు రకాల కారణాలున్నాయి. అందులో ఒకటి సరైన క్రమంలో నిద్రపోవడం… సాధారణంగా చాలా మంది ఇష్టానుసారమైన క్రమంలో నిద్రపోతుంటారు.
కానీ నిజానికి ఎడమ చేతిని తల కింద దిండుగా పెట్టి ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎడమవైపు పడుకోవడం వలన ఎక్కువ సేపు నిద్రించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. బోర్లా పడుకుంటునే నిద్రపట్టే వాళ్లు ఉంటారు. కానీ ఇలా నిద్రపోవడం చాలా ప్రమాదకరం… అవి ఏంటో తెలుసుకోండి…
మహిళలు బోర్లా పడుకుని నిద్రపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలు బోర్లా పడుకుంటే ఛాతి నొప్పి వస్తుంది. బోర్లా పడుకున్నప్పుడు ఛాతిపై ఒత్తిడి ఎక్కువవుతుంది. దీంతో ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే బోర్లా పడుకోవడం వలన ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. బోర్లా పడుకోవడం వలన చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు.
దీంతో ముఖంపై మొటిమలు, ముడతలు ఏర్పడతాయి. గర్భధారణ సమయంలో బోర్లా పడుకోవడం వలన తల్లికి , బిడ్డకు మంచిది కాదు. స్త్రీలు మాత్రమే కాదు… పురుషులు కూడా బోర్లా పడుకోవడం వలన కడుపు సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమ్సయలు వస్తాయి.
health-tips-about-sleeping-position
బోర్లా పడుకున్నప్పుడు వెన్నుపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా వెన్ను నొప్పి వస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాగే బోర్లా పడుకున్నప్పుడు ఉపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ స్థితిలో నిద్రపోవడం వలన హెర్నియేటెడ్ డిస్క్ లు వంటి ధీర్ఘకాలిక మెడ సమస్యలు కలుగుతాయి. బోర్లా పడుకోవడం వలన ఎక్కువగా మెడ నొప్పి వస్తుంది. అందుకో వీలైనంతవరకు ఎడమవైపు నిద్రపోయేలా అలవాటు చేసుకోండి.
Read Also : మీ ఇంట్లో ఇవి ఉంటే.. అన్నీ శుభాలే.. చేతి నిండా డబ్బు..!