Good Sleep Tips : నేటి కంప్యూటర్ కాలంలో స్త్రీ,పురుషులు అనే తేడా లేకుండా చాలామంది ప్రశాంతమైన నిద్రను పొందలేకపోతున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు,స్మోకింగ్, అనారోగ్య సమస్యలు, లేనిపోని భయాలు వంటి కారణాల వల్ల ప్రశాంతమైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎంత ప్రయత్నించినా ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు అని ఇబ్బందిపడేవారు పడుకోవడానికి ముందు బెడ్ పై కూర్చొని మైండ్ లో నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆందోళన కలిగించే విషయాలను,భయాలను బయటకు తోసేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేయాలి. ఇలా 15 నుంచి 20 సార్లు చేస్తే ఆ తర్వాత ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
నిద్ర పాడు చేయడంలో ముఖ్యంగా ఒత్తిడి ముందుంటుంది. అందువల్ల ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే,అంత ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది. చాలామంది లో పగటి పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారికి రాత్రి నిద్ర పట్టదు. కాబట్టి పగటి పూట నిద్రపోకుండా ఉంటే రాత్రి హాయిగా పడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పగటి పూట నిద్ర రాకుండా ఉండాలంటే.. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. కొందరు పడుకునే ముందు టీ, కాఫీ, తాగుతుంటారు. కానీ.. టీ,కాఫీ లో ఉండే కెఫిన్ నిద్ర పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అందువల్ల పడుకోవడానికి ముందు ఇటువంటి పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే పడుకునే ముందు మన మనసుకు నచ్చిన పాటలు వినడం ద్వారా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అలాగే మంచి బుక్స్ చదవడం వల్ల మెదడు మరియు మనసు రెండు ప్రశాంతంగా మారిపోతాయి. దాంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. హాయిగా నిద్రించాలంటే మనం పడుకునే ప్రదేశం కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే మనకు సెట్ అయ్యే బెడ్ నే ఎంచుకోవాలి.
Read Also : White Hair Becomes Black : ఈ చిట్కాతో వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా.. ఎలాగంటే..