...

Aloevera Side Effects: ఆరోగ్యంగా కోసం అలోవెరా జ్యూస్ అధికంగా తాగుతున్నారా ? ఇది తెలుసుకోవాల్సిందే!

Aloevera Side Effects: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలలో అలోవేరా ఒకటి. ఔషధ రంగంలో అలోవెరా ఒక అద్భుతమైన మొక్కగా పరిగణిస్తారు. ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే కాకుండా సహజ సౌందర్యాన్ని, చర్మకాంతిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఇక కలబంద నుంచి తయారు చేసే జ్యూస్ పర్ఫెక్ట్ హెల్త్ డ్రింక్ గా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. అందుకే చాలామంది అలోవెరా జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటారు.ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని అలోవెరా జ్యూస్ అధికంగా తినటం వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రమాదాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

మీరు కలబంద జ్యూస్ కనుక తాగుతున్నట్లు అయితే ఒకసారి వైద్యుని సంప్రదించి రక్తంలో చక్కెర స్థాయిలను కనుక్కోవాలి షుగర్ వ్యాధితో బాధ పడేవారు ముఖ్యంగా వైద్యుని సంప్రదించి ఈ జ్యూస్ తాగడం ఎంతో మంచిది కలబంద జ్యూస్ తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది. ప్రతి రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది. తద్వారా మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.కలబందలో భేదిమందు లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అతి సారానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి కనుక ఎక్కువగా తాగకపోవడం మంచిది.

మన శరీరంలో పొటాషియం స్థాయిలను తొందరగా తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇలా పొటాషియం స్థాయిలు తగ్గటం వల్ల తీవ్రమైన తలనొప్పి అసాధారణమైన హృదయస్పందన కండరాలు తిమ్మిరి వంటి లక్షణాలు కనపడతాయి. ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ స్టాండర్డ్ ప్రకారం.. అలోయిన్ కంటెంట్ 10ppm(పార్ట్స్ పర్ మిలియన్) కంటే తక్కువగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక గర్భవతులు అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ కలబంద జ్యూస్ కాకపోవడమే మంచిది.