Breakfast : ప్రస్తుత కాలంలో ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి. వందలో 80 శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు వారు వారు తీసుకొని ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే ఉన్న సమస్యతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయటానికి సమయం లేక ఉరుకులు పరుగులతో వెళుతుంటారు. అయితే షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

షుగర్ వ్యాధితో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అంతే కాకుండా ఉదయం అల్పాహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ సమయం కడుపునిండిన అనుభూతి కలుగుతుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్ వారు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్, బీన్స్, చిరు ధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
Breakfast:
అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ వారు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఫైబర్ రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో తోడ్పడుతుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్ వారు తీసుకునే అల్పాహారంలో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు వారు తీసుకొని ఆహారంలో తగిన మోతాదులో కొవ్వు శాతం ఉండేలా చూసుకోవాలి. పరిమిత స్థాయిలో కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
Read Aiso : Health tips: బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!