...

Tips for weight loss: అన్నం తిన్నా సన్నగా అవ్వాలంటే.. ఇలా చేయాల్సిందే!

Tips for weight loss: ప్రస్తుత కాలంలో చాలా మంది ఉండాల్సిన దాని కంటే అధిక బరువును కల్గి ఉంటున్నారు. నిజానికి అలాంటి వాళ్లు సన్నగా అయ్యేందుకు చేయని ప్రయత్నం ఉండదు. యోగాలు, ఎక్సర్ సైజ్ లు, మెడిసిన్ లు వంటివి వాడుతూ… అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరేమో రోజూ రాత్రి చపాతీ తింటే చాలు సన్నబడిపోతామని భావిస్తుంటారు. నిజానికి త్వరగా బరువు తగ్గిపోవడం అనేది చాలా కష్టం. అయితే ఊబకాయం లేదా అధిక బరువు సమస్య ఉన్న వాళ్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

మరికొందరేమో ఆహారం తీసుకోవడమే పూర్తిగా మానేస్తారు. అన్నం తినడం వల్లే లావు అవుతున్నామని భావిస్తారు. కానీ కార్బో హైడ్రేట్స్ కూడా మీ శరీరానికి ముఖ్యం అనే విషయాన్ని తెల్సుకోండి. ప్రోటీన్లు, విటామిన్ల లాగే కార్బో హైడ్రేట్లు కూడా మనకు తప్పనిసరిగా కావాలి. అలాగే ఒకసారి థెరపిస్ట్ ని కలిసి వారి సలహా తీసుకోండి. నిద్ర విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్ర పోవాలి. రోజంతా యాక్టివ్ గా ఉండటం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు. తినగానే కాసేపు నడవండి. మోటివేషన్ తీస్కోవాలి. దగ్గర దగ్గరగా ఉన్న మార్కెట్లు, సూపర్ మార్కెట్ల వద్దకు నడుచుకుంటూనే వెళ్లాలి. అలాగే బయటి ఫుడ్ కి బదులుగా ఇంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అదే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.