...

Hair Growth: పొడవైన ఒత్తైన జుట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా… వారానికి ఒకసారి ఈ చిట్కా పాటించండి… అందమైన జుట్టు మీ సొంతం!

Hair Growth: అమ్మాయిలు పొడవైన ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ విధంగా మార్కెట్లో దొరికే ఎన్నో షాంపూలు ఉపయోగించిన,ఎన్నో చిట్కాలు ఉపయోగించిన కొందరికి జుట్టు పెరుగుదలలో ఏమాత్రం ఫలితం ఉండదు.అయితే పొడవైన నల్లని ఒత్తైన జుట్టు కావాలనుకునే వారు వారానికి ఒకసారి ఉల్లిపాయలతో ఈ చిట్కా పాటిస్తే చాలు అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. మరి ఆ చిట్కా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మనం నిత్యం వంటలకు ఉపయోగించే 4 ఉల్లిపాయలను తీసుకొని వాటి పైన పొట్టు తొలగించి నీరు లేకుండా మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి ఎలాంటి నీరు కలపకుండా ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి దాని నుంచి ఉల్లిపాయ రసాన్ని మరొక గిన్నెలోకి తీయాలి. ఇలా ఉల్లిపాయల రసాన్ని దూది సహాయంతో మన జుట్టు కుదుళ్ళకు బాగా అంటించాలి. ఈ విధంగా గంట తర్వాత మరొకసారి ఉల్లిపాయ రసంతో జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి.

ఇలా పట్టించిన అనంతరం మెత్తని మిశ్రమంలా తయారు చేసిన ఉల్లిపాయ తొక్కను తల వెంట్రుకలకు రాసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ తొక్కను తలకు అంటించిన గంట తర్వాత శుభ్రంగా తలంటు స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి ఈ ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల మీరు కోరుకున్న అందమైన పొడవైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది. అలాగే తలలో ఏ విధమైనటువంటి చుండ్రు సమస్యలు లేకుండా జుట్టును సంరక్షిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.