...

Health Tips: రోడ్డు పక్కన దొరికే ఈ ఆకుతో నులిపురుగులకు చెక్ పెట్టవచ్చు?

Health Tips: సాధారణంగా మనం ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే వారు తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలా కడుపు నొప్పితో బాధపడటానికి కారణం నులి పురుగులు కూడా కావచ్చు.అపరిశుభ్రమైన ఆహారం కలుషితమైన నీరు తీసుకోవటం లేదా మట్టిలో పిల్లలు ఆడుకొని అదే చేతులతో తినటం వల్ల నులిపురుగులు ఏర్పడతాయి. అయితే ఈ నులిపురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించి నులిపురుగులు బలపడుతూ మనల్ని బలహీనం చేస్తాయి.

ఈ విధంగా నులిపురుగులు బలపడటం వల్ల తరచూ పిల్లలు కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు కుప్పింటాకుతో చెక్ పెట్టవచ్చు. ఈ ఆకు సాధారణంగా పల్లెటూరులో రోడ్డుకిరువైపులా కూడా పెరుగుతూ ఉంటుంది. పల్లెటూర్లలో ఉండే వారికి ఈ ఆకు ఎంతో సుపరిచితమైన ఉంటుంది. ఈ ఆకుతో నులిపురుగుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. 15 కుప్పింటాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని 25ml మోతాదులో వారం రోజుల పాటు తాగటంవల్ల నులిపురుగుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఈ ఆకుతో కేవలం నులిపురుగుల సమస్యలకు మాత్రమే కాకుండా మలబద్ధకం సమస్యను కీళ్లనొప్పుల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కుప్పింటాకు రసంలోకి టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేయడం వల్ల నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ ఆకురసం కొందరి శరీర తత్వానికి సరిపోదు. అలాంటి వారు తాగక పోవడమే మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చే వారు కూడా ఈ ఆకు రసం తాగకపోవడం ఎంతో మంచిది.