Jana Gana Mana Movie : పూరి ‘జనగణమన’ అటకెక్కడానికి మహేష్ బాబు శాపమే కారణమా?!

Updated on: October 23, 2022

Jana Gana Mana Movie : టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ అంటే.. అది పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అని చెప్పేస్తారు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాను తెరకెక్కించడంలో పూరి స్టయిలే వేరు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాల్లో పూరి మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఎన్నో హిట్ సినిమాలను అందించిన పూరి.. కొద్దికాలంగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు పూరి సినిమా అంటే.. పెద్ద హీరోలు సైతం తెగ ఇంట్రెస్ట్ చూపించేవారు.. కానీ, పూరి సినిమాలు వరుస ప్లాప్ లు రావడంతో పరిస్థితి మారిపోయింది.

Why Mahesh Babu did Not take up Puri Jagannadh's Jana Gana Mana Pan India Movie
Why Mahesh Babu did Not take up Puri Jagannadh’s Jana Gana Mana Pan India Movie

పూరితో సినిమా అంటే చాలు.. వామ్మో అంటూ స్టార్ హీరోలు దూరంగా వెళ్లిపోతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ మూవీకి కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయి ఉంటే.. విజయ్ దేవరకొండతో జనగణమన మూవీ కూడా తెరకెక్కించాలని పూరీ ప్లాన్ చేశాడు. అందుకే లైగర్ మూవీ రిలీజ్ కావడానికి ముందే కొంతవరకు షూటింగ్ కూడా అయిందట.. కానీ, లైగర్ దెబ్బకు జనగణమన షూటింగ్ అటకెక్కింది. లైగర్ మూవీ (Liger Movie) డిజాస్టర్ కావడంతో దేవరకొండ కాకుండా ఇతర హీరోలతో తీసేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నాడట..

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Jana Gana Mana Movie : లైగర్ దెబ్బకు జనగణమనకు బ్రేక్..!

వాస్తవానికి.. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ మూవీని మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలనుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కించేందుకు పూరీ చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి కారణం ఏంటో పూర్తిగా తెలియదు.. మహేష్‌ను కాదని పూరి మరొకరితో మూవీని తెరకెక్కించేందుకు సిద్ధం కావడానికి మధ్య ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Why Mahesh Babu did Not take up Puri Jagannadh's Jana Gana Mana Pan India Movie
Why Mahesh Babu did Not take up Puri Jagannadh’s Jana Gana Mana Pan India Movie

ఏది ఏమైనా.. ఈ మూవీ మహేష్‌కు మాత్రమే సరిపోతుందని, ఆయన మాత్రమే న్యాయం చేయగలడని సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మహేష్ కాకుండా బాలీవుడ్ హీరోలతో పూరి జనగణమన (Jana Gana Mana Movie) మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు విఫలం కావడానికి మహేష్ బాబు (Mahesh Babu) శాపం తగలడమే కారణమని, అందుకే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

టాలీవుడ్ హీరోలు కాకుండా బాలీవుడ్ హీరోలతో జనగణమన మూవీని తెరకెక్కిస్తే ఎంతవరకు పూరికి ప్లస్ అవుతుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహేష్‌, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ఒక్కడు మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఆ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తగల్లేదు. తిరిగి.. తిరిగి.. మళ్లీ జనగణమన మూవీ మహేష్ బాబు దగ్గరకే వస్తుందో లేదో చూడాలి.

Read Also : RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం పొగిడేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel