Ram Charan-Upasana : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన గురించి తెలియని వారంటూ ఉండరు. ఉపాసన ఒక కోడలిగా మంచి భార్య గా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తోంది. ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే కోడలిగా ఇంటి బాధ్యతలు, భార్య గా రామ్ చరణ్ పనులు చూసుకుంటుంది. ఇక ఉపాసన అపోలో ఇన్చార్జి గా వ్యవహరిస్తున్నప్పటికీ ఆమె ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక కెరీర్ పరంగా ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కాగా ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫాలోవర్స్ ని తన సొంతం చేసుకుంది.

ఈమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆరోగ్యకరమైన సందేశాలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక అదే విధంగా హెల్త్ రెసిపీస్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాల గురించి తన అభిమానులు అందరికీ చెప్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది.
Ram Charan-Upasana : ఆది దంపతుల్లా చరణ్, ఉపాసన..
ఇక రామ్ చరణ్, ఉపాసన కలిసి ఏ వెకేషన్ కి వెళ్ళినా కూడా ఆ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. అలాగే సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు గురించి కూడా తన అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన కలిసి పూజ చేసిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా మెగా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పూజ గది మొత్తం పూలతో చాలా అందంగా అలంకరించారు. చరణ్, ఉపాసన దంపతులు ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు.
AdvertisementView this post on Instagram
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
Advertisement
ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇందులో ఒక ఫోటో ని ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. పూజలో రామ్ చరణ్ మరియు ఉపాసన సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఇక రామ్ చరణ్ బ్లాక్ షర్ట్ వైట్ కలర్ పంచ కట్టులో కనిపించారు. పూజ తర్వాత రామ్ చరణ్ ఉపాసన నుదుటిన కుంకుమ బొట్టు పెట్టారు. ఇక ఈ విధంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలని ఉపాసన షేర్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. భార్య భర్తల బంధం అంటే ఇలా ఉండాలి అంటూ వారిపై ప్రశంశలు కురిపిస్తున్నారు.
Read Also : Lavanya Tripathi : వరుణ్ తేజ్‌తో ఎఫైర్.. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్‘పై లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చేసిందిగా..!