Woman suicide : అత్తింటి వరకట్న వేధఇంపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఎస్సై మామిడి మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లికి చెందిన ఓర్పుల ఎల్లయ్య తన కూతురు లాస్య అలియాస్ మనీళను సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలం ఇబ్రహీంనగర్ కు చెందిన కవాతి ఎల్లకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు.
పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల నగదు, 6 తులాల బంగారం ముట్టజెప్పారు. రెండేళ్ల పాటు దంపతుల కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో మూడేళ్లుగా భర్త ఎల్లం, అత్తమామ ఆడబిడ్డలు అదనపు కట్నం తీసుకు రావాలని మనీషాని వేధించసాగారు.
దీంతో మనస్తాపం చెందిన లాస్య మంగళవారం తల తల్లి గారింట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త ఎల్లం, అత్తామామ, అడ బిడ్డలే కారణం అని మృతురాలి తండ్రి ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Read Also : Crime news: భర్తను మార్చుకోవాలని ప్లాన్ వేసింది.. అదే అతడి పాలిట యమపాశమైంది!