Telangana assembly : మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ స్పీకర్ నోటీసులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అయితే బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి ఆహ్వానించలేదు. ఈ విషయంపై స్పందించిన ఈటల రాజేందర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గత సంప్రదాయాలను తుంగలో తొక్కి సీఎం కేసీఆర్.. ఏది చెబితే స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మర మనిషిలా అదే చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీఏసీ సమమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని నిలదీశారు. సీఎంలు వస్తుంటారు, పోతుంటారు.. అసెంబ్లీ మాత్రం శాస్వతంగా ఉంటుందన్న సంగతి మరిచిపోవద్దని అన్నారు. సభా సంప్రదాయాలను కాలరాసే అధికారం ఎవరికీ లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ పై ఈటల రాజేందరన్ చేసిన వ్యాఖ్యలను ఆయన కార్యాలయం తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనకు నోటీసులు జారీ చేసింది.
Read Also : BJP Focus: టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. ఏం చేయబోతున్నారు?