...

BJP Focus: టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. ఏం చేయబోతున్నారు?

BJP Focus: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన మరో ఎంపీకి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు ఉండగా.. మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కమలం పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్ లో ఎవరికి ఛాన్స్ వస్తుందనేది సస్పెన్స్ గా మారింది.

ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. పార్టీ స్పెషల్ ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉందనే స్పష్టతను ఇచ్చేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం ఇక్కడే నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు రాష్ట్రానికి పంపిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం సెన్సేషనల్ కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచే ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయన అయితే కవిత, కేసీఆర్ లను ఓడించగలరని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.