Viral Video : సోషల్ మీడియాకు యువత బానిసలుగా మారుతున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, యూట్యూబ్ షార్ట్స్ ను విపరీతంగా వాడేస్తున్నారు. పొద్దున లేచింది మొదలు మళ్లీ పుడుకునే వరకు అందులోనే మునిగి తేలుతున్నారు. చాలా మంది కుర్రకారు ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. విపరీతంగా ఫోన్ ను యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ లో అలా అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా కళ్లు ఫోన్ తెరపైనే ఉంచి బదులిస్తారు.
తినే సమయంలోనూ ఒక చేతిలో ఫోన్ మాత్రం ఉండాల్సిందే. అమ్మా నాన్న, అక్కా చెల్లి తమ్ముడు అన్నా ఎవరు పలకరించినా ఏమని ప్రశ్నించినా.. ఏది అడిగినా.. వారు మాత్రం తమ కళ్లను ఫోన్ కు అప్పగించే బదులు ఇస్తారు. రాత్రి ఫోన్ పట్టుకునే నిద్రకు ఉపక్రమిస్తారు. ఏ అర్ధరాత్రో నిద్ర పోతారు. నిద్ర పోతున్న సమయంలోనే ఫోన్ దిండు పక్కనే ఉండాలి. లేకపోతే నిద్ర పట్టదు. అంతలా అడిక్ట్ అయిపోతోంది కుర్ర కారు.
ఇలా సోషల్ మీడియాకు బానిసైన ఓ యువకుడు ఇన్ స్టా రీల్ తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే యువకుడు స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆదివారం సరదాగా ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి ట్రాక్ పై రీల్స్ షూట్ చేయాలని అనుకున్నారు.
ఫ్రెండ్స్ తో వచ్చిన రకరకాల వీడియోలు తీస్తున్నారు. అలా ట్రాక్ పక్క నుండి నడుస్తుంటే పక్కనే రైలు వేగంగా వెళ్లేలా షాట్ తీయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ట్రాక్ కు చాలా తక్కువ దూరం నుండి అజయ్ నడుచుకుంటూ వస్తుండగా.. మరొకరు దానినంతా ఫోన్ లో షూట్ చేస్తున్నారు. అలా తీస్తున్నప్పుడే రైలు వేగంగా వచ్చి అజయ్ ను ఢీకొట్టంది. వెంటనే స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువడుకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
17-year-old grievously injured while making Instagram reel at railway track near Kazipet in #Telangana. pic.twitter.com/2iuisZdVCj
— Ashish (@KP_Aashish) September 5, 2022