Man Rape Dog : నేటి సమాజంలో కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతలా దిగజారిపోతున్నారంటే మనుషుల నుంచి నోరు లేని మూగ జీవాలను కూడా వదలని దుస్థితికి చేరారు. తాజాగా శునకంపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడి కథ బట్టబయలైంది. ఈ దారుణం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా… సీసీ ఫుటేజ్ గమనించిన స్థానికులు ఆ ఘటనను చూసి నివ్వెరపోయారు. ఆ వెంటనే జంతు హక్కుల కార్యకర్తలకు పంపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నల్లకుంటలో చోటు చేసుకుంది.
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింహ బస్తీలో ఓ వ్యక్తి గత మూడు రోజులుగా ఒక కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇది గమనించిన కొందరు వ్యక్తులు సీసీ టీవీ ఫుటేజ్ వీడియోను జంతు హక్కుల కార్యకర్తలకు పంపారు. ఈ వీడియోని చూసి వారు కూడా షాక్ అవుతున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
కాగా జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11(A) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మూగజీవి పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ఉన్మాదిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియా లో హల్ చల్ అవుతుండగా… వీడియోని వీక్షించిన వారంతా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also : Cashew Benefits for male : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World