Online games: ఈ మధ్య చిన్న పిల్లలు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మూడేళ్ల వయసు నుంచే స్మార్ట్ ఫోన్లు వాడేస్తున్నారు. గేమ్స్ ఆడేస్తున్నారు. ఇలాగే ఓ అబ్బాయి తాతా మొబైల్ లో గేమ్ ఆడి ఏకంగా 36 లక్షలు స్వాహా చేసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన ఓ విశ్రాంత పోలీస్.. ఇటీవలే మరణించారు. అయితే ఇన్ని రోజులు ఆయన వాడిన ఫోన్ తర్వాత ఖాళీగానే ఉంది. అది గమనించిన కుమార్తె కొడుకు దాన్ని వాడటం ప్రారంభించాడు. తల్లిదండ్రులకు అడిగితే ఎప్పుడూ విసుక్కోవడం వల్ల.. ఖాళీగా ఉన్న తాత మొబైల్ దొరకగానే గేమ్ ఆడటం ప్రారంభించాడు.
బాలుడికి ఫ్రీ ఫైర్ గేమ్ అంటే చాలా ఇష్టం. దీంతో ముందుగా 1500 రూపాయలు పెట్టి గేమ్ ఆడాడు. త్వరగా గేమ్ ఆడాలన్నా ఆతృతతో తరచూ పేమెంట్లు చేయడం ప్రారంబించాడు. 10 వేల రూపాయల చొప్పున 60 సార్లు నగదు పెట్టి గేమ్ ఆడాడు. ప్రతీ సారి డబ్బులు పెట్టి గేమ్ ఆడటంతో.. మొబైల్ లోని అకౌంటెంట్ పై కన్నేశారు గేమింగ్ సిబ్బంది. ఇలా చరవాణిలో నెట్ బ్యాంకింగ్ ఉండటం వల్ల..2 లక్షలు, లక్షా 95 వేలు, లక్షా 60 వేలు, లక్షా 45 వేలు, లక్షా 25 వేలు, 50 వేల చొప్పున వేర్వేరు సందర్భాల్లో నగదు స్వాహా చేసేశారు. ఇలా మొత్తం 36 లక్షలను దోచేశారు.
ఏదో అవసరం పడి కుటుంబ సబ్యులు నగదు డ్రా చేద్దామని సదరు బాలుడి కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లారు. నగదులో నిండుగా ఉండాల్సిన అకౌంట్ లో డబ్బులు నిల్ అని ఉండటంతో షాకయ్యారు. వెంటనే బ్యాంకు సిబ్బందిని ఆరా తీయగా… అసలు విషయం అవగతమైంది. ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే కుటుంబ సభ్యులకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.