...

Love cheating: ఒకరితో పెళ్లి.. మరొకరితో ఎంగేజ్ మెంట్.. చివరకు!

Love cheating: ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసగించాడని ఓ యువతి శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ లో ప్రియుని ఇంటి ముందు బైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి.. పట్టణంలోని జన్కాపూర్ కు చెందిన ఓ యువకుడు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకు రావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు.

ఎంత వరకూ రాకపోవడంతో శుక్రవారం ఆసిఫాబాద్ కు వచ్చినట్లు ఆమె వివరించింది. సదరు యువకుడికి వివాహం నిశ్చయించినట్లు తెలిసి న్యాయం చేయాలని అతని ఇంటి ఎదుట బైఠాయించింది. ఈమెకు మహిళా సంఘాల సభ్యుల మద్దతు తెలిపారు. అబ్బాయి వచ్చి ఆమెను పెళ్లి చేసుకునే వరకు ఈ ధర్నా ఆపబోయేది లేదని వివరించారు. తనకు ప్రేమికుడితో పెళ్లి తప్ప మరేం వద్దని… అతడి కోసం ఏం చేయడానికి అయినా తాను రెడీ అని అమ్మాయి చెబుతోంది.