Crime news: ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది భక్తుల సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. తంజావూరులోని కరిమేడు అప్పర్ ఆలయ రథం ఊరేగింపు సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రథాన్ని ఊరేగిస్తూ తీసుకువెళ్తున్న సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసి పడ్డాయి. ఇది కాస్త ఘోర అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఈ దుర్ఘటనలో 11 మంది భక్తులు సజీవంగా దహనం అయ్యారు.

Advertisement

చని పోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉండటం అందరి మనసులను కలచి వేస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో మరో 15 మంది కూడా గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ సంభవించిన వెనువెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రథం పూర్తిగా కాలి బూడిద అయింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement