Student Suicide: నిర్మల్ జిల్లా కేంద్రంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కల్యాణి అనే విద్యార్థిని ఉరివేసుకొని అత్మహత్య చేస్కుంది. అయితే ఆమె తన హాస్టల్ రూంలోనో, ఇంటి వద్దో ఉరివేసుకోలేదు. ఓ అబ్బాయి రూంలో బలవన్మరణానికి పాల్పడింది. అయితే అసుల ఆమె ఎందుకంలా చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జిల్లాలోని పెంబి మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కల్యాణి అనే విద్యార్థి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది. అయితే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం భీపూర్ గ్రామానికి చెందినట్లు పోలీసులు తేల్చారు. నిర్మల్ లోని దివ్య నగర్ లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. అయితే రమేష్, కల్యాణికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే అమ్మాయి అబ్బాయి రూంకి వెళ్లింది. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగిందో లేదో తెలియదు గానీ ఆమె అతడి రూంలోనే ఆత్మహత్య చేస్కుంది. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురు చావుకు కారణం అయినా రమేష్ ను తమకు అప్పగిచాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకి దిగారు.