Telugu NewsEntertainmentHemachandra: విడాకులకు సిద్ధమైన సింగర్స్ హేమచంద్ర శ్రావణ భార్గవి.. ఇదే ప్రూఫ్?

Hemachandra: విడాకులకు సిద్ధమైన సింగర్స్ హేమచంద్ర శ్రావణ భార్గవి.. ఇదే ప్రూఫ్?

Hemachandra: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా విడాకుల పరంపర కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఉన్న వారు చాలా మటుకు రెండు మూడు వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు.ఇలా ఎంతో మంది ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇస్తే తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన వారు ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ క్రేజీ కపుల్స్ సమంత నాగచైతన్య విడాకులు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.ఈ క్రమంలోనే ఈ ఘటన మరిచిపోకముందే కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం విడాకులు తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరు విడాకులు తీసుకుని ఎవరి జీవితంలో వారు స్థిరపడుతున్నారు.

Advertisement
singers-hemachandra-shravan-bhargavi-are-preparing-for-divorce-is-this-the-proof
singers-hemachandra-shravan-bhargavi-are-preparing-for-divorce-is-this-the-proof

ఇకపోతే తాజాగా విడాకులకు మరొక జంట సిద్ధమైందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హేమచంద్ర శ్రావణ భార్గవి జంట గురించి అందరికీ తెలిసిందే.శ్రావణ భార్గవి మంచి సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా వీరిద్దరి ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2013లో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Advertisement

వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది. ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితంలో తొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగిన ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య గొడవల కారణంగా ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారని ఇలా వేరువేరుగా ఉండటంతోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించకపోవడమేకాకుండా శ్రావణ భార్గవి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలోనూ కామెంట్ సెక్షన్ బ్లాక్ చేయడంతో వీరిద్దరి గురించి వస్తున్న వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు