Pushpa Review : ‘పుష్ప’ బెనిఫిట్ షో రివ్యూ.. ఫ్యాన్స్ టాక్..!

Pushpa Review : Allu Arjun Fans Review on Pushpa Benefit Show, Social Media
Pushpa Review : Allu Arjun Fans Review on Pushpa Benefit Show, Social Media

Pushpa Review : పుష్ప మానియా మొదలైంది. పుష్పరాజ్ వచ్చేశాడు.. థియేటర్లన్నీ సందడిగా ప్రేక్షకులతో కిటకిటలాడిపోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ థియేటర్లలో దద్దరిల్లిపోతోంది. అల్లూ అభిమానులకు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. పుష్ప సూపర్ డూపర్ హిట్ అంటూ అల్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ హ్యాట్రిక్ అంటూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటీ రష్మిక జోడిగా అద్భుతంగా నటించింది. పుష్ప కాంబినేష లో వచ్చిన మూడో సినిమా హ్యాట్రిక్‌గా నిలిచిందంటున్నారు చూసిన అభిమానులు.. ఐకాన్ అల్లు అర్జున్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.

పుష్ప మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. పాటలు కూడా హిట్ టాక్ అందుకున్నాయి. పుష్ప నుంచి వచ్చిన ప్రతి ట్రైలర్, టీజర్ నెట్టింట్లో దుమ్మురేపాయి. దాంతో పుష్ప మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే బెనిఫిట్ షోలు పడిపోయాయి. యూఎస్ అయితే షోలు కూడా పడిపోయాయి. పుష్ప ది రైజ్.. ఫస్ట్ పార్ట్ చూసిన అభిమానులంతా సోషల్ మీడియాలో పుష్ప హ్యాట్రిక్ హిట్ అంటూ రివ్యూలను ఇస్తున్నారు.

Advertisement

అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనేస్తున్నారు. యాక్షన్ సీన్లలో బన్నీ ఇరగదీశాడని అంటున్నారు. బన్నీ మాత్రమే కనిపించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్.. పుష్ప ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒక రేంజ్ లో ఉందంటున్నారు. బన్నీ చేసిన సీన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. అడవుల్లో ఫైట్ స్పెషల్ అంటున్నారు.

Advertisement

హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సమంత చేసిన స్పెషల్ సాంగ్ కేక అనేస్తున్నారు.. బన్నీ డ్యాన్స్.. సరికొత్త స్టెప్పులతో అదరగొట్టేశాడని చెబుతున్నారు. పుష్పలో మెయిన్ ట్విస్ట్ ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’.. ఇది పాటలోదిగా చెబుతున్నారు. అల్లు అర్జున్, రష్మిక మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు అభిమానులు.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ సెకాండఫ్‌ ఉందంట.. ఏదిఏమైనా.. సుకుమార్, బన్నీ కాంబినేషన్ హ్యాట్రిక్ గా నిలుస్తుందని అంటున్నారు.

Advertisement

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : షన్నుపై సిరి లవర్ సీరియస్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

Advertisement