RGV Comments : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సెన్సెషన్.. ఈయన ఎప్పుడైనా ఫ్రీ మైండ్‌తో ఉన్నాడంటే ఎవరో ఒకరి మీద బాంబ్ పేలుస్తాడు. తాజాగా ఆర్జీవీ ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్ పై స్పందించాడు. ఇందులో కొత్తేమి ఉంది, మహా అంటే ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తాడు అనుకుంటాం.. నిజమే అది అందరూ ఊహించవచ్చు. హీరో అల్లు అర్జున్ లేదా దర్శకుడు సుకుమార్, సినిమాలోని స్టోరీ పరంగా చేసిన కామెంట్ అస్సలే కాదు. ఈ సినిమాతో సంబంధం లేని వారిని లాగి వారి పరువు తీసేసాడు. ఏకంగా వారంతా వేస్ట్ అన్న మీనింగ్ వచ్చేలా వాగాడు ఆర్జీవీ.
ఆర్జీవీ ఓ సంచలన దర్శకుడు అనే కంటే వివాదాలకు కేరాఫ్ అనుకోవచ్చు. ఇప్పటికి అందరూ రామ్ గోపాల్ వర్మను అలాగే చూస్తారు. కొందరు ఆయనకు సపోర్టు చేస్తుంటే మరికొందరు విమర్శిస్తుంటారు. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ నిజం మాట్లాడటంలో అస్సలు వెనుకాడరు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు గొడతారు. క్రిమినల్ థాట్స్ పోవాలంటే పోర్న్ చూసే రకం ఆర్జీవీ. పొలిటికల్, సినిమా, క్రైం ఇలా దేనిగురించి, ఎవరి గురించి ఆలోచించడు.. తనకు ఆ క్షణంలో ఏది అనిపిస్తే వారిపై ఓ కామెంట్ అలా పడేసి ఇతరులు కొట్టుకుంటుంటే ఆయన పైశాచిక ఆనందం పొందుతాడు. అందుకే ఆయన్ను అందరూ పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు.
తాజాగా పుష్ప ట్రైలర్ వీక్షించిన ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రియల్ సూపర్ హీరో అంటే అల్లు అర్జున్ ఒక్కడేనని.. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎవ్వరూ అల్లు అర్జున్‌కు పోటీ రాలేరని.. వారంతా వేస్ట్ అన్నట్టు సంచలన కామెంట్స్ చేశారు. సినిమా కోసం బన్నీ ప్రాణం పెడతాడని, ఆయన చేసే రోల్స్ మీరంతా చేయగలరా? అంటూ అగ్రహీరోలకు సవాల్ విసిరారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీలో బన్నీని పొగిడి మిగతా హీరోలకు కించపరచడం కరెక్ట్ కాదని కొందరు అనుకుంటున్నారు.దీనిపై ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Read Also : Laxmi Raai : అసలు ఎంఎస్ ధోని నేను ఎందుకు విడిపోయామంటే..? లక్ష్మీ రాయ్ సంచలన కామెంట్స్
Tufan9 Telugu News providing All Categories of Content from all over world