...

Shakila Comments : మహేశ్ బాబు నన్ను అలాగే పిలిచేవాడు.. షకీల షాకింగ్ కామెంట్స్!

Shakila Comments : షకీలా.. ఈ యాక్టర్ గురించి సౌత్ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. మళయాళం ఇండస్ట్రీకి చెందిన షకీలా కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా బీ గ్రేడ్ పాత్రలు పోషించాల్సి వచ్చిందట.. ఆ తర్వాత తనకు ఎప్పుడూ మంచి పాత్రలు రాలేదని, దీంతో గోల్డ్, వ్యాంప్ పాత్రలు పోషించాల్సి వచ్చిందని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అస్సలు తను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, తన కుటుంబ సభ్యులు ఎందుకు మోసం చేశారు, ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుందనే విషయాలను ఆమె చెప్పుకొచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో నటించడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి కమెడియన్స్‌లో నటుడు వేణుమాధవ్ అంటే ఎంతో అభిమానం అని షకీలా చెప్పుకొచ్చింది. షకీలా జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

ఒకప్పుడు మళయాళం సినిమా పరిశ్రమను షకీలా షేక్ చేసింది. ఆమెతో నటనలో చాలా మంది పోటీపడలేకపోయేవారట. అయితే, తాను బీగ్రేడ్ సినిమాల్లో ఎక్కువగా నటించడానికి గల కారణాలను బయటపెట్టింది ఈ సీనియర్ నటి.. మొదట్లో తాను సినిమా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు దర్శకులు చాలా మంది తన బాడీలోని అందాన్ని గుర్తించారని, కానీ తన నటనను ప్రూవ్ చేయించుకునే టైం ఇవ్వలేదని చెప్పింది. ఆనాడు వారింట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులకు గాను బీ గ్రేడ్, గోల్డ్ మూవీల్లో నటించేందుకు ఓకే చెప్పిందట.. అదే దర్శకులు తన నటనను నిరూపించుకునే అవకాశాలు ఇచ్చియుంటే తాను కూడా ఇప్పుడు మిగతా హీరోయిన్స్ మాదిరిగా మంచి పొజిషన్‌లో ఉండే దానిని అని ఎమోషనల్ అయ్యింది.

ఇకపోతే షకీలా తాను సంపాదించిన ప్రతీ రూపాయి తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేదానని అని చెప్పుకొచ్చింది. చివరకు వారు మోసం చేయడంతో ప్రస్తుతం తనకు సొంతిళ్లు కూడా లేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రాంతంలో తాను దత్తత తీసుకున్న కూతురితో కలిసి ఉంటున్నానని షకీలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ వేణుమాధవ్ తో తనకు మంచి పరిచయం ఉందన్నారు. వ్యక్తిగా వేణుమాధవ్ చాలా మంచి వారని, అతను బతికి ఉన్నప్పుడు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది షకీలా. వేణుమాధవ్ మరణం తనకు తీరని లోటని చెప్పింది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు తనను అక్కయ్య అని పిలుస్తారని పేర్కొంది నటి షకీలా..

Read Also : RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!