Pushpa 2 Title Leak : అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ (పుష్ప ది రైజ్) భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అందుకుంది.
సోషల్ మీడియా వేదికగా పుష్ప హ్యాట్రిక్ హిట్ అంటూ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పుష్ప మూవీకి సంబంధించి ఆసక్తికరమైన పోస్టులను పెడుతున్నారు. అల‍్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘పుష్ప: ది రైజ్’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన వెంటనే.. పుష్ప మూవీ రెండో పార్ట్ టైటిల్ లీక్ అయింది.
Pushpa Second Part Title Leak : పుష్ప రివ్యూ..
‘పుష్ప ది రైజ్’ మూవీ చివరిలో సెకండ్ పార్ట్ పేరును కూడా సుకుమార్ రివీల్ చేశాడు. పుష్ప మూవీ రెండో పార్ట్‌కు ‘పుష్ప-ది రూల్’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. సెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్ రూలింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
బన్నీ షేడ్స్ ఏమైనా సరికొత్తగా ఉండనున్నాయా అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే. బన్నీ పుష్పరాజ్‌గా అద్భుతంగా నటించగా.. రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. ఇక టాప్ యాక్టరస్ సమంత స్పెషల్ ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసి కుర్రకారుకు పిచ్చెక్కిచ్చింది..
Never before ever after … What a twist ! Ayya sukku 🙏🙏 #Pushpa#AlluArjun iragadeesavayya#Sukumar
Waiting for #PushpaTheRule#PushpaTheRise pic.twitter.com/xoUcCbhqgn— Tony Soprano (@RULER_Pspk) December 17, 2021
Read Also : Pushpa Review : ‘పుష్ప’ బెనిఫిట్ షో రివ్యూ.. ఫ్యాన్స్ టాక్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world