Ariyana : గ్రాండ్ ఫినాలేలో అరియాన చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..!

Ariyana : ఓటీటీలో ప్రసారమైన అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 24/7
ఓటీటీలో ప్రసారమైన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ షో మొదటిలో కొంచం బోర్ గా ఫీల్ అయిన ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలయిన సమయం నుండీ ఆసక్తిగా చూడటం మొదలు పెట్టారు. ఇలా ఈ నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. 18 కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ నాన్ స్టాప్ రియాలిటీ షో లో ఏడు మంది కంటెస్టెంట్ లు చేరుకున్నారు.

Advertisement
Ariyana
Ariyana

వీరిలో బిందూ,అఖిల్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా,శివ , అరియానా మూడూ, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక మిత్రా, అనిల్, బాబా భాస్కర్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ 7 మంది కంటెస్టెంట్ లు టైటిల్ కోసం ఒకరితో ఒకరు గట్టిపోటీ ఇస్తూ ఫినాలే వరకు చేరుకున్నారు. కాగా ఈ నాన్ స్టాప్ సీజన్ టైటిల్ బిందు గెలుచుకోగా ,అఖిల్ రన్నర్ గా నిలిచాడు. ఇక టాప్3 లో శివ ఉన్నారు. గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సునీల్, అనిల్ రావిపూడిను సిల్వర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి హౌజ్ లోకి పంపి కంటెస్టెంట్ లతో డబ్బుతో బేరం ఆడించాడు. అయితే వీరిలో ముగ్గురు డబ్బు వద్దనగా అరియానా మాత్రం డబ్బు మీద ఆసక్తి చూపింది.

Advertisement

బ్రీఫ్ కేస్ లో ఎంత ఉంటుంది అంటూ అడగ్గా.. కచ్చితంగా లక్షల్లో ఉంటుందని నాగార్జున హామీ ఇవ్వటంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చింది. అయితే ప్లాట్ కొనుక్కోవాలి అన్న తన కల నెరవేర్చుకోవటం కోసం తనకి డబ్బు కావాలని డబ్బు తీసుకొని బయటికి వచ్చింది. అరియానా స్టేజి మీదకు రాగానే సునీల్, అనిల్,నాగర్జున కలిసి కొంచం సేపు ఏడిపించారు. ఈ క్రమంలో సునీల్,అనిల్ ని కూడా తిట్టింది. అయితే అరియానా ఇలా డబ్బు తీసుకొని బయటికి రావటంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. టైటిల్ కోసం కాకుండా కేవలం డబ్బు కోసం మాత్రమే గేమ్ ఆడిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Bigg Boss winner : బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ గెలుచుకున్న బిందు.. ఎమోషనల్ స్పీచ్..!

Advertisement
Advertisement